Tuesday, 3 November 2026

ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టాలి

ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టాలి
* టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్

టేకులపల్లి, జనవరి 1( జనం సాక్షి ): ఉపాధ్యాయుల బదిలీలు,పదోన్నతులు ఈ సంక్రాంతి సెలవులలో చేపట్టి మూడు విడతలుగా రావలసిన డిఏలను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వ ఉన్నత పాఠశాల టేకులపల్లిలో టిపిటిఎఫ్ మండల అధ్యక్షులు వాసం భాస్కరరావు అధ్యక్షతన జరిగిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు గత నాలుగు సంవత్సరాలుగా బదిలీలు,8 సంవత్సరాలుగా పదోన్నతులు లేక అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతూ నష్టపోతున్నారని, పిఆర్సి 2021 ప్రకారం ఏజెన్సీలో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన ఎస్ సి ఏ,ఏ హెచ్ ఆర్ ఏ జీవోలను వెంటనే విడుదల చేయాలని, కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలకు అన్ని రకాల పోస్టులను మంజూరు చేయాలని, గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులకు గ్రేడ్ వన్ హెచ్ డబ్ల్యు ఓ,ఎ టి డి ఓ,డి టి డి ఓ,డి డి పోస్టుల ప్రమోషన్లలో అవకాశం కల్పించాలని, ముంపు మండలాలలో పనిచేసిన ఉపాధ్యాయులకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఒక నెల జీతాన్ని మొత్తాన్ని ఒకేసారి కాకుండా వాయిదాల రూపంలో తిరిగి రికవరీ చేయాలని, ఐటీడీఏ భద్రాచలం పరిధిలో పనిచేస్తూ ఇన్ సర్వీస్ బీఈడీ కొరకు ఎన్ఓసీకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ వెంటనే ఎన్వోసీ ఇవ్వాలని, ఐటీడీఏలో ఉపాధ్యాయులకు మౌఖికంగా ఇస్తున్న డిప్యూటేషన్ల పర్వాన్ని ఆపాలని, ఐటీడీఏ పరిధిలో వివిధ కారణాలతో తొలగించబడిన సిఆర్టిలలో కొంతమందిని మాత్రమే తిరిగి తీసుకొని మిగతా వారిని తీసుకోకపోవడం అన్యాయమని మిగిలిన వారందరికీ పోస్టింగులు ఇవ్వాలని,కేజీబీవీ బోధన బోధనేతర సిబ్బంది సమ