Tuesday, 3 November 2026

మా ఇంటి కానుక కార్యక్రమంలో భాగంగా ఆధునిక గ్రామదర్శిని వ్యవస్థాపకులు యాఫ్ టీవీ సీఈఓ పాడి ఉదయ్ నందన్ రెడ్డి

మా ఇంటి కానుక కార్యక్రమంలో భాగంగా ఆధునిక గ్రామదర్శిని వ్యవస్థాపకులు యాఫ్ టీవీ సీఈఓ
పాడి ఉదయ్ నందన్ రెడ్డి

వీణవంక జనవరి 2 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రంతోపాటు పలు గ్రామాలకు చెందిన వారికి యఫ్ టీవీ సీఈఓ పాడి. ఉదయ్ నందన్ రెడ్డి సూచన మేరకు తన వ్యక్తిగత అనుచరుల సహాయంతో నూతనంగా వివాహమైన నిరుపేద కుటుంబాలకు మా ఇంటి కార్యక్రమంలో భాగంగా వీణవంక గ్రామానికి చెందిన తాళ్ల పెళ్లి. వీరయ్య రేణుక దంపతుల ప్రధమ కుమారుడు కార్తీక్- అఖిల, మరియు తాళ్ల పెళ్లి రమేష్ రజిత దంపతుల రెండవ పుత్రిక సన్నిహిత-గౌతమ్ మరియు కొండపాక గ్రామానికి చెందిన గట్టు ఐలయ్య రాజేశ్వరి దంపతుల మొదటి పుత్రుడు శ్రీకాంత్-శ్రావణి వారికి ఇటీవల వివాహాలు జరగగా పేద కుటుంబాలకు మా ఇంటి కానుక లో భాగంగా ప్రతి కుటుంబానికి ఐదువేల రూపాయల చొప్పున మూడు కుటుంబాలకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ వివాహ కుటుంబాలు పాడి ఉదయ్ నందన్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి దాసారపు ప్రభాకర్ , అమృత ప్రభాకర్, సమిడ్ల ప్రకాష్, దాసారపు రాజేష్, రాజు, లోకేష్ ,వంశీకృష్ణ తాళ్లపెళ్లి కుమారస్వామి,తిరుపతి,సతీష్, సిరిగిరి రాజశేఖర్,పూదరి కోటి,మేడుదుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు..