హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఐడీఏ ఉప్పల్‌లో ఉన్న జీవీకే బయోసైన్స్ రసాయన సంస్థలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్దఎత్తున ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన సంస్థపక్కనే గ్యాస్ సిలిండర్ల గోదాం ఉండడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఒక్కపెట్టున మంటలు రావడతో సంస్థలోని సిబ్బంది, ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. రసాయనాల ఘాటు వాసన పరిసర ప్రాంతాలకు వ్యాపించడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.




