హైదారాబాద్ : హైదారాబాద్ ఉప్పల్లో భారీ చోరీ జరిగింది. బీరప్పగడ్డలో ఓ ఇంట్లో చొరబడిన దొంగలు 30 తులాల బంగారం, రెండు కిలోల వెండి, ల్యాప్ టాప్, 20వేల నగదు దోచుకెళ్లారు. ఇంటికి తాళం వేసిఉండటాన్ని గమనించిన దొంగలు. ఇంటి తాళం పగులగొట్టి ఉన్నకాడికి దోచుకెళ్లారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.




