Tuesday, 3 November 2026

ఉప్పల్‌ టెస్టులో భారత్‌ ఘన విజయం

హైదరాబాద్‌: రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్‌ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ 135 పరుగుల తేడాతో ఉప్పల్‌ టెస్టులను కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ బౌలర్ల ధాటికి ఆసీన్‌ చేతులెత్తేసి 131 పరుగులకే ఆలౌట్‌ అయింది. కోవాన్‌ 44, వార్నర్‌ 26, క్లార్క్‌ 16, వాడే 10 పరుగులు చేయగా మిగతావారు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్‌ 5, జడేజా 3, శర్మ 1 వికెట్‌ తీశారు. ఈ విజయంతో 4 టెస్టుల సిరిన్‌లో భారత్‌కు 2-0 ఆధిక్యం లభించింది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : 237/9 డిక్లేర్డ్‌
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 503 ఆలౌట్‌
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ : 131 ఆలౌట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *