హైదరాబాద్: రెండో టెస్టులో విజయం దిశగా టీంఇండియా దూసుకుపోతోంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. 130 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి భారీ ఓటమి దిశగా సాగుతోంది. వాడే (10) ఆశ్విన్ బౌలింగ్‌లో సెహ్వాగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు 130 పరుగులు వద్ద సిడిల్ (4), మాక్స్‌వెల్ (8) ఔటయ్యారు.




