Wednesday, 4 November 2026

ఉప్పునుంతలలో బిజెపి బూత్ స్వశక్తి కరణ్  అభియాన్ సమావేశం

 

 

 

 

 

అచ్చంపేట ఆర్సి 10 ఏప్రిల్ 2023 జనం సాక్షి న్యూస్ : నియోజకవర్గ పరిధిలోని ఉప్పునుంతల మండల కేంద్రం బిజెపి పార్టీ  బూత్ స్వశక్తి అభియాన్  కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అచ్చంపేట నియోజకవర్గ నాయకులు సతీష్ మాదిగ హాజరయ్యి మాట్లాడుతూ… ఉప్పునుంతల మండలంలో గల 34 బూతులలో 11 శక్తి కేంద్రాలలో ప్రతి గ్రామంలో బూత్ కమిటీలు 31 మందితో బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలని  స్థానిక నేతలకు సూచించారు.  కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ  పార్టీ బలో పేతానికి కృషి చేయాలని అచ్చంపేట నియోజక వర్గం లో బిజెపి పార్టీని గెలిపించాలని కోరారు.  కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాలు ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతదని డబల్ ఇంజన్ సర్కారే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకుంటారన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ కన్వీనర్ రాగిణీ కొండల్ రెడ్డి,ఉప్పునుంతల మండల బిజేపీ అధ్యక్షుడు వావిలాల రమేష్,ఎస్టీ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ పత్య నాయక్  , జిల్లా కార్యవర్గ సభ్యుడు జగన్ గౌడు. బిజెపి పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు. కా కునూరి బ్రహ్మచారి.తొల మహేష్ యాదవ్. మండల ఉపాధ్యక్షుడు దుడ్డుఎల్లయ యాదవ్. కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బాల్ రెడ్డి గారు. ఉపాధ్యక్షుడు. బి నరేందర్ రెడ్డి. బీసీ మోర్చమండల అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్. ఉపాధ్యక్షుడు. ఇనుగంటి శ్రీనివాస్. మండల కార్యవర్గ సభ్యులు  మొగిలి ఆంజనేయులు. కొండల్ గౌడు. పానుగంటి మల్లేష్.బలరాం యాదవ్.శ్రీకాంత్. బాలస్వామి. వెంకటేష్. సాయి. గణేష్.హరీష్ నవీన్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.