జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ముస్తాల గ్రామంలో దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ అసెంబ్లీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు విగ్రహ ప్రతిష్ఠాపన కోసం మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తీరుపతి యాదవ్ సోమవారం భూమిపూజ చేశారు. ఈ నెల 13న శ్రీపాదరావు వర్ధంతి రోజున ఏఐసీసీ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే దుదిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేయబోతున్నామని అన్నారు. అజాత శతృవుగా మన్ననలందుకున్న మహనీయుడు శ్రీపాదరావు ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారని తిరుపతి యాదవ్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ తో పాటు స్థానిక సర్పంచ్ రామగిరి లావణ్య నాగరాజు, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇనుముల సతీష్, పన్నుర్ ఎంపీటీసీ కొప్పుల గణపతి, ఎస్సీ సెల్ అధ్యక్షులు కండే పోచం, రామగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి శివ, సుందిళ్ళ కృష్ణ, కొముర్నేని శ్రీనివాస్, మచ్చ రవి, విజేందర్ రెడ్డి, జక్కుల యాదగిరి,సుదమల్ల మొగిలి, సుందిళ్ళ సురేష్, జనగామ కృష్ణ,గోసిక సురేష్, రాంచందర్, గడ్డం సమ్మయ్య, ఉదురుకోట కుమార్, రక్షిత్, పాషా, షాహిద్, తదితరులు పాల్గొన్నారు.




