ఉప ఎన్నికలో ఉత్తరాఖండ్‌ సీఎం విజయం

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణ ఉప ఎన్నికలో విజయం సాధించారు. సితార్‌గంజ్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన తన సమీప ప్రత్యర్థి భాజపా అభ్యర్థిప్రకాశ్‌పంత్‌పై 39,954 ఓట్ల తేడాతో గెలుపొందారు. జూలై 8న ఇక్కడ ఉప ఎన్నికలు నిర్వహించారు.