హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్ సంతకం ఫోర్జరీ కేసు విచారణపై ఐసీఎస్ ఉమేష్‌కుమార్ పిటిషన్‌ను నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు మంగళవారం తోసిపుచ్చింది. సంతకం ఫోర్జరీ కేసు విచారణను నాంపల్లి సీఐడీ కోర్టు నుంచి వేరే కోర్టుకు మార్చాలన్న ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. గతంలో ఈ కేసు విషయమై ఉమేష్ కుమార్‌కు హైకోర్టులో కూడా చుక్కెదురు అయ్యింది.




