Thursday, 5 November 2026

ఉమ్మడి కోటగిరి మండలాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

ఉమ్మడి కోటగిరి మండలాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.

కోటగిరి డిసెంబర్ 9 జనం సాక్షి:-తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం,60 ఏళ్ల తెలంగాణ పోరాటాన్ని,ఆకాంక్షను గుర్తించిన సోనియా గాంధీ కృషి ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి,కోటగిరి ఎంపిటిసి కొట్టం మనోహర్ పేర్కొన్నారు.శుక్రవారం రోజున కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కోటగిరి పోతంగల్ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కొట్టం మనోహర్ మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నేడు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆనాడు జాతీయ సలహా కమిటీ,యూపీఏ అధ్యక్షురాలుగా సోనియాగాంధీ కొనసాగిన తరుణంలో దేశవ్యాప్తంగా అనేక చట్టాలు, సంస్కరణలు అనగా జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్,ప్రత్యేక గుర్తింపు అథారిటీ,సమాచార హక్కు చట్టం,గ్రామీణ ఉపాధి పథకం,పలు రకాల ప్రాజెక్టులు అమలు చేయడంలో సోనియా గాంధీ పాత్ర కీలకమైనదని అన్నారు.రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇందిరమ్మ,సోనియమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి కోటగిరి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ హుస్సేన్, మాజీ జెడ్పిటిసి పుప్పాల శంకర్,మాజీ ఎంపిపి గంగాధర్ దేశాయ్,సాబేర్,కోటగిరి టౌన్ ప్రెసిడెంట్ అయుబ్,వాహిద్, ఫత,ఆనంద్,శంకర్, లింగారాం,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.