Thursday, 5 November 2026

సోనియాగాంమదిన వేన్డుకను ఘనంగా నిర్వహించిన పెద్దిరెడ్డి

ధీ జసోనియాగాంమదిన వేన్డుకను ఘనంగా నిర్వహించిన పెద్దిరెడ్డి

దేవరుప్పుల,09 (జనం సాక్షి): దేవరుప్పుల మండలంలోని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు పెద్ది కృష్ణమూర్తి గౌడ్’ ఆధ్వర్యంలో జనగామ-సూర్యాపేట రహదారిపై కాంగ్రేస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ’ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తదనంతరం పండ్లు,మిఠాయిలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సిసెల్ అధ్యక్షులు మేడ ఎల్లయ్య,ఎస్టీసెల్ అధ్యక్షులు భూక్య సజ్జన్,మండల యూత్ అధ్యక్షులు బోనగిరి యాకస్వామి,రెడ్డిరాజుల రమేష్,పులిపంపుల భాస్కర్,రవి,అబ్బయ్య,యాదగిరి,యూత్ నాయకులు ఉప్పుల ప్రకాష్,ఉప్పుల అనిల్, కొంగరి ఉమేష్,శ్రీకాంత్,నాయకులు ప్రభాకర్,సోమయ్య,తదితర నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.