
సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూలై 8 :: —-
ఈనెల 14వ తేదీన శిశు మందిర్ వద్ద శిల్పారామం లోని సంగారెడ్డి ఫోటోగ్రాఫర్స్ & వీడియో గ్రాఫర్స్, బోనాల విందుకు యూనియన్ నాయకులు ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం ను శాల్వాతో సత్కరించి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పట్నం మాణిక్యం మాట్లాడుతూ సంగారెడ్డి ఫోటోగ్రాఫర్స్ & వీడియో గ్రాఫర్స్ యూనియన్ కు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని వారు చేసే కార్యక్రమానికి తన హాజరవుతానని హామీని ఇచ్చారు ఈ కార్యక్రమానికి పట్నం మాణిక్యం ఫౌండేషన్ ద్వారా తన వంతు సహాయం అందిస్తానని హామినీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఫోటోగ్రాఫర్స్ & వీడియో గ్రాఫర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




