పలువురికి ప్రగాఢ సానుభూతి తెలిపిన అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం *

 

 

 

అలంపూర్ జూలై 8(జనంసాక్షి)
* వడ్డేపల్లి మున్సిపాల్టీ పైపడు నందు క్రిస్టఫర్ వయసు 25 అనారోగ్యంతో బాధపడుతు శనివారం మరణించారు. విషయం తెలుసుకున్న అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం వారి ఇంటికి వెళ్లి వారి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారికి ఆర్థిక సహాయం అందచేసి రైతు బీమా పథకం ద్వారా అగ్రికల్చర్ AO గారితో చరవని లో మాట్లాడి త్వరగా బీమా క్లైమ్ చేయాలని ఆదేశించారు.అదే గ్రామానికి చెందిన నరసింహ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతు మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం వారి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎమ్మెల్యే గారి వెంట వడ్డేపల్లి జెడ్పీటీసీ కషా పోగు రాజు ,మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ,డీలర్ శ్రీను, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మహేష్ , ప్రేమ్ కుమార్,మత్తు,శేకర్ ,డ్రైవర్ చిన్న, మరియు BRS పార్టీ నాయకులు మరియు తదితరులు ఉన్నారు.

తాజావార్తలు