Monday, 2 November 2026

ఉల్లి నిల్వలపై తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు

హైదరాబాద్‌: ఉల్లి డీలర్ల లైసెన్సులు, నిల్వ, నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం ఈరోజు నోటిఫికేషన్‌ జారీచేసింది. ఉల్లి నిల్వలకు సంబంధించి జనాభా ఆధారంగా పరిమాణాన్ని నిర్దేశించింది. 10 లక్షలకు పైగా ఉన్న నగరాల్లో ఒక్కో వ్యాపారి 75 క్వింటాళ్లు, పట్టణ ప్రాంతాల్లో 40 క్వింటాళ్లు, గ్రామాల్లో 30 క్వింటాళ్ల వరకు నిల్వ చేసుకోవచ్చని పేర్కొంది. ప్రతి ఉల్లి వ్యాపారులు ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని నిబంధన విధించింది. రైతుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ ధరకు కొనరాదని, వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్మరాదని హెచ్చరించింది. ధరలు ఎక్కువగా ఉంటే రేషన్‌ దుకాణాల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *