హైదరాబాద్, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల నుంచి విద్యార్థినులు అసెంబ్లీకి ర్యాలీగా బయలు దేరారు. ఎన్‌సీసీ గేటు దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొంటారనే అనుమానంతో సుందరయ్య విజ్ఞానకేంద్రం సమీపంలోని కాలనీల్లో పోలీసులు సోదాలు జరిపి ఇళ్లల్లో ఉన్నవారిని అరెస్టు చేశారు. అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ప్రజాసంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు.




