హైదరాబాద్, సెప్టెంబరు 30 : రైతుల అంశంపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావులు కోరారు. ప్రతిపక్షాలకు రాజకీయాలు తప్ప రైతుల సమస్యలు పట్టవా అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. రైతులకు భరోసా ఇచ్చే విధంగా సభలో చర్చిద్దామని మంత్రి కోరారు. అన్ని ప్రజా సమస్యలపై సభలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.




