!
!అత్యంత ప్రమాదకరంగా రవాణా చేస్తున్న ఊక లారీలుకోటగిరి జనవరి 31 జనం సాక్షి:-రోడ్లను ఆక్రమిస్తూ, రవాణా నిబంధనకు విరుద్ధంగా నో రూల్స్ అంటూ కోటగిరి,పోతంగల్ మండలాలలో యదేచ్చగా ఊక లారీలు ఊక లోడుతో ప్రయాణిస్తూ ప్రయాణికుల పాలిట మృత్యుపాశాలుగా మారాయి.మితిమీరిన లోడుతో ఈ వాహనాలు వెళ్తుంటే,వెనుక ముందు నుండి వచ్చే వాహనదారులకు అసౌకర్యమే కాకుండా,రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ స్తంభాలకు, వచ్చి పోయే వాహనాలకు తగులుకోవడంతో తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి.కోటగిరి పోతంగల్ మండలాల గుండా పదుల సంఖ్యలో ఊక లారీలు మహారాష్ట్రకు నిత్యం ప్రయాణిస్తున్నాయి. అపరిమిత ఊక లోడుతో వాహనాలు వెళ్తుంటే మరో వాహనం ప్రయానించలేని పరిస్థితి ఏర్పడుతోంది. రాత్రి పగలు అని తేడా లేకుండా అపరిమిత లోడుతో ఊక లారీలు రాకపోకలు కొనసాగిస్తు వెనుక నుండి వచ్చే వాహనాదారులకు కళ్ళల్లో నీరు తెప్పిస్తున్నా యి.అయినప్పటికీ సంబంధిత అధికారులు మౌనము ద్ర వహించడం ఆందోళన కలిగిస్తున్నాయి.రోడ్లను ఆక్రమిస్తు ఊక లారీలు ప్రయాణించడం చేత వెనుక, ముందు నుండి వచ్చే వాహనదారులకు తీవ్ర అంతరా యం కలిగించడమే కాకుండా పలువురు ప్రయాణ దారులు ప్రమాదాల భారిన పడుతున్నారు.ఇక ఓవర్ లోడ్ ఓవర్ స్పీడ్తో ఊక వాహనాలు ప్రయాణిస్తూ గాలి ద్వారా ఊక ఎగిరి వచ్చి వాహనదారుల కళ్ళలో పడితే ఇక నరకమే కాకుండా నేత్ర సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు.ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఇటువంటి వాహనాలపై తగుచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.




