Tuesday, 3 November 2026

శివాజీ మహరాజ్ విగ్రహ స్థాపనకు భూమి పూజ.

 

 

 

 

దోమ పిబ్రవరి 1(జనం సాక్షి)దోమ మండల పరిధిలోని దాదాపూర్ గ్రామంలో రవిచంద్ర యువజన సంఘం ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ స్థాపనకు బుధవారం స్థానిక సర్పంచ్ ఊరగావలి కృష్ణ గ్రామ పెద్దలు సమక్షంలో భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా శివాజీ విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సైనిక కుటుంబంలో పుట్టి మహా చక్రవర్తి గా కీర్తి ప్రతిష్ఠలు సాధించారని, ఓటమి ఎరుగని మహావీరుడు చత్రపతి శివాజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఆర్. నర్సింలు, ఆర్. ప్రకాష్ రెడ్డి, కుర్వ వెంకటయ్య, బసన్న గౌడ్, బాలయ్య కమ్మరి యాదగిరి చారి, రాములు గౌడ్, గాళ్ల వెంకటయ్య,పిఎన్ పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఘనపురం రాఘవేందర్ గౌడ్, యూత్ సభ్యులు గురు చరణ్ గౌడ్, గఫార్, గురుదాస్, ఆంజనేయులు, దస్తయ్య, శివ కుమార్, వెంకటయ్య గౌడ్, దస్తయ్య, రమేష్, గ్రామస్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.