సికింద్రాబాద్ : హైదరాబాద్ డివిజన్‌లోని ఎంఎంటీఎస్ సేవలకు ప్రజాధరణను పెంపొందించేందుకు దక్షిణమధ్య రైల్వే చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. దీనిలో భాగంగా మంగళవారం సీతాఫల్‌మండి-ఫలక్‌నుమా-ఉందానగర్ సెక్షన్‌లో విస్తృతంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేగవంతమైన, చౌక అయిన, సురక్షితమైన, సమయపాలనతో కూడిన ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకోవాల్సిందిగా ప్రజలను కోరారు. దక్షిణమధ్యరైల్వే హైదరాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ బి.డి.కిష్టోఫర్, అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ కె.వేణుగోపాల్‌రెడ్డిల నేతృత్వంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, టిక్కెట్ చెకింగ్ సిబ్బంది, కమర్షియల్ ఇన్‌స్పెక్టర్లు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.




