Wednesday, 4 November 2026

హైదరాబాద్‌లో అర్ధరాత్రి చైన్‌స్నాచర్ల ఘాతుకం

మలక్‌పేట, ఆగస్టు 19 : హైదరాబాద్‌ నగరంలోని మలక్‌పేట ఫ్లైఓవర్‌ దగ్గర అర్ధరాత్రి చైన్‌స్నాచర్లు ఘాతుకానికి పాల్పడ్డారు. బైక్‌పై వెళుతున్న దంపతులను చైన్‌స్నాచర్లు వెంబడించి వర్దనమ్మ మెడలోని బంగారు గొలుసును స్నాచర్లు లాగారు. దీంతో వర్దనమ్మ బైక్‌పై నుంచి కిందపడి తలకు తీవ్ర గాయమైంది. ఆమెను సమీపంలోని యశోద ఆసుపత్రికి తరలించారు. వర్దనమ్మ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *