Thursday, 5 November 2026

ఎంపి శివప్రసాద్‌పై ట్రాన్స్‌జెండర్‌ ఫిర్యాదు

విజయవాడ,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో తమ మనోభావాలు దెబ్బతీసేలా చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ ప్రవర్తించారని ట్రాన్స్‌ జెండర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి తమన్నా సింహాద్రి విజయవాడ గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళనలో భాగంగా స్వలింగ సంపర్కుల వేషధారణలో ఉన్న శివప్రసాద్‌.. ట్రాన్స్‌ జెండర్‌ అని చెప్పడం దారుణమని అన్నారు. తాము మహిళలతో సమానమని ఆమె అన్నారు. శరీర భాగాలు మార్చుకుని మహిళలతో సమానంగా జీవిస్తున్న తమను ఎంపీ అవమానించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.