Wednesday, 4 November 2026

‘ఎంపీటీసీలకు రూ. 20 వేల వేతనం ఇవ్వాలి’

హైదరాబాద్ : ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌తో ఎంపీటీసీల ఫోరం ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు తమ సమస్యలపై మంత్రితో చర్చించారు. తమకు రూ. 20 వేల గౌరవ వేతనం ఇవ్వాలని మంత్రిని కోరారు. ఎంపీటీసీలను ఉత్సవ విగ్రహాల్లా మార్చవద్దు అని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంపీటీసీలకు భాగస్వామ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *