Tuesday, 3 November 2026

ఎంపీటీసీ ఆధ్వర్యంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు చేయించిన ఎమ్మెల్యే కు ఘనంగా సన్మానం

 

 

 

 

 

భువనగిరి టౌన్ ( జనం సాక్షి ):– భువనగిరి మండలంలోని బియన్ తిమ్మాపురం గ్రామానికి చెందిన ఎంపీటీసీ ఉడత శారద ఆంజనేయులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారిని కలిసి మా గ్రామానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు విడుదల చేయించిన సందర్భంగా కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారితో ఎంపీటీసీ మాట్లాడుతూ ఇంకా వెయ్యి ఎకరాలకు భూముల నష్టపరిహారం రావాల్సి ఉంది మరియు హుస్నాబాద్ వద్ద కేటాయించే ప్లాట్లు అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఇల్లు కట్టుకోవడానికి పది లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా వచ్చే విధంగా చూడాలని కోరారు మరియు జీవనోపాధి కోసం ఊరి విడిచి వెళ్లిన వారికి కూడా అరండల్ ప్యాకేజ్ వర్తింపజేయాలని కోరారు దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రభుత్వం ద్వారా మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని పునరావాస కాలనీ కూడా అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసి మీకు ఇస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సుబ్బురు బీరు మల్లయ్య ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు డొంకెన ప్రభాకర్ గౌడ్ ఉప సర్పంచ్ ఎడ్ల దర్శన్ రెడ్డి జిన్నా సత్యనారాయణ గ్రామస్తులు ఉన్నారు.