రామారెడ్డి జనవరి 28 జనం సాక్షిరైల్వే ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుందని రైల్వే పోలీసులు తెలిపారు రైల్వే పోలీసులు వివరాలు ఇలా ఉన్నాయి రాత్రి సమయంలో కామారెడ్డి నుండి నాందేడ్ వైపు వెళ్తున్న రైళ్లు ఒకరు ప్రయాణిస్తుండగా డోర్ మధ్యన కుర్చోని ఉన్న వ్యక్తి ( ఓంకార్ అశోక్ రావు మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తి ) కింద పడి రైలు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుందని వివరించారు. రామారెడ్డి మండలం రంగంపేట్ శివారులో దుర్ఘటన చోటుచేసు కుందన్నారు. మృతి చెందిన వ్యక్తి జేబులో నుంచి కింద పడిన ఆధార్ కార్డు ప్రకారం నాందేడ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించామని అన్నారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి , మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు




