Tuesday, 3 November 2026

ఎంపీ కవితకు వైస్ ఎంపీపీ జాటోత్ దేవేందర్ జన్మదిన శుభాకాంక్షలు

ఎంపీ కవితకు వైస్ ఎంపీపీ జాటోత్ దేవేందర్ జన్మదిన శుభాకాంక్షలు..

డోర్నకల్ ప్రతినిధి జనవరి 1( జనం సాక్షి):
మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు, పార్లమెంటు సభ్యురాలు ఎంపీ కవిత జన్మదిన సందర్భంగా నరసింహుల పేట వైస్ ఎంపీపీ జాటోత్ దేవేందర్ బొకే ఇచ్చి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవితమ్మ జన్మదినం జిల్లాకే పండుగ దినమన్నారు.నూతన సంవత్సర దినోత్సవం,పుట్టినరోజు ఒకేరోజు కావడం సంతోషకరమన్నారు.ప్రజల కష్టాలు తన కష్టాలుగా భావించి సేవ చేస్తుందన్నారు.ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.