కొండమల్లేపల్లి మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కేసాని లింగారెడ్డి కొండమల్లేపల్లి జనవరి 1 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల ప్రజానీకానికి, రైతు సోదరులకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు,పట్టణ వ్యాపారస్తులకు, యువతకు, బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కేసాని లింగారెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023 ప్రజల ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, సంపద, సమృద్ధి కలుగాలని ఆకాంక్షించారు సంవత్సరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ప్రతీ కొత్త సంవత్సరం ఎన్నో ఆశలను, మరెన్నో ఆశయాలను మోసుకొస్తుంది. మనం ఇప్పటివరకు చేయలేనివి, ఈ కొత్త ఏడాదిలో అయినా పూర్తి చేయాలని గుర్తు చేస్తుంది. కాలం ఆగదు, గడిచిన క్షణం వెనక్కి రాదు. కాలం ఎలా అయితే ముందుకు వెళ్తుందో, అలాగే మనమంతా కూడా ముందుకు వెళ్లాలి, పురోగమించాలి. అనుకున్న పనులు నెరవేరాలి, అన్ని శుభాలు జరగాలి అని ఆశిద్దాం. భవిష్యత్తు బాగుండాలని కలలు కందాం, ఆ కలలు నెరవెర్చుకునే దిశగా అడుగులు వేద్దాం అని ఒక ప్రకటనలో తెలిపారు
కొండమల్లేపల్లి మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు




