Monday, 2 November 2026

ఎంపీ కవితది కీలకపాత్ర..!

dc-cover-rojui89bvlrpl22smhuv77tkf2-20160701203145-mediసింగరేణి డిపెండెంట్‌ ఉద్యోగాలను పునరుద్ధరించడంలో ఎంపీ, టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితది కీలకపాత్రని, కార్మికవర్గం ఆమెకు రుణపడి ఉంటారని శాసనసభ్యుడు కోరం కనకయ్య, టీబీజీకేఎస్‌ నాయకులు కనగాల పేరయ్య, గడ్డం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వం డిపెండెంట్‌ ఉద్యోగాలను కాలరాసిందని, అందుకు జాతీయ కార్మిక సంఘాలన్నీ సహకరించాయని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సింగరేణి కార్మికుల కష్టసుఖాలను గమనంలోకి తీసుకుని సింగరేణిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయినప్పటికీ ఎంతో గొప్ప మనస్సుతో సీఎం కేసీఆర్‌ డిపెండెంట్‌ ఉద్యోగాలను కల్పించడం చారిత్రాత్మకమన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *