Monday, 2 November 2026

ట్రంప్ కి సపోర్ట్ గా మాజీ మిస్ ఇండియా

తనపై ఎన్ని ఆరోపణలు, విమర్శలు వస్తున్నా రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్ లెక్క చేయడం లేదు. తనదైన శైలిలోనే ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాడు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అందాల భామలతో54881093 ప్రచారం చేయిస్తున్నాడు. బాలీవుడ్ హీరోయిన్, మాజీ మిస్ ఇండియా మనస్వి మామగై.. ట్రంప్ కు మద్దతుగా ప్రచారం సాగిస్తున్నారు. న్యూయార్క్ లో భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త శలభ్ కుమార్ తో కలిసి ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.భారత దేశంతో సన్నిహితంగా మెలిగే విషయంలో హిల్లరీ క్లింటన్ కంటే ట్రంప్ మేలని మనస్వి అభిప్రాయపడింది. ప్రభుదేవా దర్శకత్వంలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన యాక్షన్ జాక్సన్ సినిమాతో మనస్వి బాలీవుడ్ కు పరిచయమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *