Thursday, 5 November 2026

ఎంపీ కవిత దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిజెపి నాయకులు

ఎంపీ కవిత దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిజెపి నాయకులు
జనం సాక్షి న్యూస్: ఉప్పునుంతల 19 నవంబర్
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం
ఉప్పునుంతల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ ఇంటిపై టిఆర్ఎస్ గుండాలు దాడికి నిరసనగా కెసిఆర్, కవిత, దిష్టిబొమ్మల ను ఉప్పునుంతల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పావిలాల రమేష్ అధ్యక్షతన దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ బిజెపి పార్టీ తెలంగాణలో ఎదుగుదలను జీర్ణించుకోలేక బిజెపి నాయకుల ఇండ్లపై భౌతిక దాడులను ప్రోత్సహించే టిఆర్ఎస్ గుండాల్లారా తెలంగాణలో ప్రజలు గమనిస్తున్నారు,వచ్చే ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్పడానికి ఎదురుచూస్తుండ్రు ఇలాంటి దాడులను ప్రతిఘటించి మీకు తగిన గుణపాఠం చెప్పడానికి బిజెపి నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఖబర్దార్ టిఆర్ఎస్ గుండాల్లారా మేము మీ లాగానే ఎదురు దాడి చేయాలంటే మీరు ఏ ఊర్లలో తిరగలేరు ఫస్ట్ ప్రజా సమస్యల మీద మన బంగారు తెలంగాణ చేస్తామన్నారు కదా ఇదేనా మీ బంగారు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టండి కానీ ఈ భౌతిక దాడుల మీద కాదు అని బిజెపి నాయకులు హెచ్చరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి కుందేల సైదులు యాదవ్, మండల ప్రధాన కార్యదర్శులు కాకునూరిబ్రహ్మచారి, తోల మహేష్ యాదవ్, ఉపాధ్యక్షుడు దొడ్డు ఎల్లన్న యాదవ్,యువ మోర్చా ప్రధాన కార్యదర్శి చీమర్ల శివకుమార్, పాతుకుల శేఖర్,కొట్టే గణేష్, మహేష్, అనిల్,పొలుగు శివ, చెంగల సాయి మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు