Wednesday, 4 November 2026

ఎంబిబిఎస్ సీటు సాధించిన విద్యార్థికి ఆర్థిక సహాయం

 

 

 

 

 

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం జనంసాక్షి న్యూస్ జనవరి26ఫోటో రైట్ అప్ 01తుర్కపల్లి ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న దృశ్యంతుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివి ఎంబీబీఎస్ సీటు సాధించిన నిరుపేద విద్యార్థిని మాలోతు కవితకు బిఆర్ఎస్ యువనేత గట్టు తేజస్వి నిఖిల్ 25 వేల రూపాయలు ,ఎంపీపీ భూక్యాసుశీల రవీందర్ నాయక్ 10వేల రూపాయలు అందజేశారు. 2022 సంవత్సరంలో 10వ తరగతిలో మొదటి స్థానం సాధించిన గడ్డి స్వాతికి 5000 రూపాయలు, రెండవ స్థానం సాధించిన గుగులోతు శ్రీవాణి కి 3000 రూపాయలు ,విద్యార్థులకు క్రీడా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మహాదేవుని శ్రీనివాస్, సర్పంచ్ యాట పోచమని పెంటయ్య, ఉపసర్పంచ్ సీతరాజు ,ఎస్ఎంసి చైర్మన్ కొమరయ్య, హెచ్ఎం సైదిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహేందర్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.