Tuesday, 3 November 2026

ఎంసెట్‌-2 లీకేజీలో మరో ఇద్దరు అరెస్టు

హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం కల్గించిన ఎంసెట్‌-2 పేపర్‌ లీకేజీ కేసులో సీఐడీ అధికారులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. పేపర్‌ లీకేజీ వ్యవహరంతో సంబంధం వున్న దళారులు శ్యామ్‌ యాదవ్‌ అలియాస్‌ గుడ్డూ, రామకృష్ణలను సోమవారం అదుపులోకి తీసుకొని విచారించారు. హైదరాబాద్‌లోని గాంధీనగర్‌కు చెందిన రామకృష్ణ ఎన్‌ఐఎన్‌లో రీసెర్చి అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.

ముంబయికి చెందిన గుడ్డూ.. ప్రధాన నిందితుడు మయాంక్‌సింగ్‌కు అనుచరుడని, ముంబయిలో 8మంది విద్యార్థులతో శిబిరం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు విద్యార్థుల నుంచి రూ.60 లక్షల వసూలు చేసిన గుడ్డూ.. ఆ మొత్తాన్ని మయాంక్‌ సింగ్‌కు పంపినట్లు సీఐడీ అధికారులు పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *