పెనుబల్లి, మే19(జనం సాక్షి)
పెనుబల్లి గ్రామపంచాయతీలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించి న సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్యకు ప్రజల తరపున కోటగిరి సుధాకర్ బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, ఎంఎల్ఏ సండ్ర ప్రత్యేక శ్రద్ధతో పెనుబల్లి గ్రామపంచాయితీ లో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.40 లక్షలు, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ని ర్మాణానికి రూ. 40 లక్షలు, ఆర్ఎంపీ వైద్యుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 25 లక్షలు , గ్రామంలో సి సి రోడ్ల నిర్మాణానికి రూ.70 లక్షలు, పెనుబల్లి బిసి కాలని శాధిఖాన పునర్ నిర్మా ణానికి రూ.75 లక్షలు నిధులు మంజూరు కెసి ఆర్ ప్రభుత్వం చేసిందని ఇందుకు ఎం ఎల్ ఏ సండ్రవెంకటవీరయ్య కు రుణపడి ఉంటామని ఆయనకు మరోసారి గ్రామం తరుపున ప్రత్యెక కృతఙ్ఞతలు తెలుపుతున్నానని సుధాకర్ అన్నారు. అలాగే పెనుబల్లి గ్రామ పంచాయితీసమస్యలను ఏం ఎల్ ఎ సండ్ర దృష్టికి తెచ్చి ఏం ఎల్ ఎ ద్వారా నిదులు మంజూరు చేయించి, అందుకు కృషి చేసిన, చేస్తున్న కోటగిరి సుధాకర్ బాబు కు ఆయన అభిమానులు, గ్రామస్థులు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.
ఎం ఎల్ ఏ సండ్ర కు పెనుబల్లి ప్రజల తరపున కోటగిరి సుధాకర్ ప్రత్యేక కృతఙ్ఞతలు




