వరంగల్ బ్యూరో, మే 19 (జనం సాక్షి) ఉమ్మడి వరంగల్ జిల్లా జువెనైల్ జస్టిస్ బోర్డ్ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్, ఒకటవ, మరియు నాలుగోవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి హనుమకొండ కోర్టుల న్యాయమూర్తిగా శ్రావణ స్వాతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సత్తుపల్లి నుంచి బదిలీ పై ఆమె ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా జువెనైల్ బోర్డ్ సభ్యులు మెరుగు సుభాష్, డా, గోపిక రాణి, డి.పి.ఓ రాధా, ఏ.పి.పి రేవతి, బార్ అసోసియేషన్ హనుమకొండ కార్యవర్గం, బి.ఆర్.బి అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, డి.సి.పి.యు చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ పోలీస్ లు ఆమె ను మర్యాదపూర్వకంగా కలిశారు.పిల్లల సమస్యలపై అందరూ కలిసి ప్రత్యేక దృష్టి ని పెట్టి పరిష్కరించాలని,కోర్ట్ లోని పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె ఏ.పి.పి ని, పోలీసులకు, కోర్ట్ సిబ్బందిని సూచించారు.
భాద్యతలు స్వీకరించిన జువెనైల్ బోర్డు న్యాయమూర్తి




