Thursday, 5 November 2026

ఎం డి ఆర్ పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

ఎం డి ఆర్ పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు
– ప్రిన్సిపాల్ నలబోలు భూపాల్ రెడ్డి హుజూర్ నగర్ డిసెంబర్ 7 (జనం సాక్షి): హుజుర్ నగర్ పట్టణంలోని ఎం డి ఆర్ పాఠశాల నందు బుధవారం సైబర్ నేరాల పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హుజుర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఏ ఎస్సై లు, పోలీసులు పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు ఏపరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్ వాడొద్దని మనకు తెలియని యాప్ ను అనవసరంగా ఉపయోగించడానికి ఆసక్తి చూపరాదనీ దాని వలన మన సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు స్వీకారిస్తారని అన్నారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ నలబోలు భూపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి విషయంలో జాగ్రత్త వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.