2.25 క్వింటాళ్ల బియ్యం అందజేత
జనం సాక్షిజోగిపేట్. ఆందోల్ జోగిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఉన్న అయ్యప్ప దేవాలయంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి జోగిపేట పట్టణానికి చెందిన అయ్యప్ప మాలదారుడు విజయ్ 2.25 క్వింటాళ్ల బియ్యం అందజేశారు. బుధవారం సాయంత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నదాన నిర్వాహకులకు అందజేశారు. ఆలయం వద్ద ప్రతిరోజు అయ్యప్ప స్వామి మాలాదారులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. బియ్యం అందజేయడంతో విజయ్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో. అయ్యప్ప స్వాములు ఆకుల రాంబాబు, మహేష్ యాదవ్, నాగరాజు, జగదీష్, మల్లేశం, మాణిక్యం, నిర్వాహకులు పులుగు గోపాల్ రావు, గాజుల నవీన్, చక్రపాణి, ముద్దు కృష్ణ, రంగంపేట రాజు తదితరులు పాల్గొన్నారు.
2.25 క్వింటాళ్ల బియ్యం అందజేత




