Friday, 6 November 2026

ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ శివకుమార్ మృతదేహాన్ని పరామర్శించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ శివకుమార్ మృతదేహాన్ని పరామర్శించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (28): మండల పరిధిలోని బుద్దారం గ్రామానికి చెందిన పోలీస్ శాఖ లో ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న T. శివ కుమార్(46) మంగళవారం రాత్రి బుద్దారం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది.విషయం తెలుసుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి బుధవారం వనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి చేరుకొని మృతదేహాన్ని పరామర్శించి,కుటుంబాన్ని ఓదార్చి ప్రభుత్వ పరంగా ఆదుకుంటానని అన్నారు .మృతునికి తల్లి లక్ష్మి దేవమ్మ, భార్య చంద్రకళ(37), ఒక కూతురు, ఇద్దరు కుమారులు ప్రశాంతి(18), క్రాంతి కుమార్(17),యశ్వంత్(14) ఉన్నారు శివ కుమార్ మృతితో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మృత దేహాన్ని చూడటానికి పోలీస్ శాఖ అధికారులు,అతని సహచర మిత్రులు,ఉద్యోగులు , గ్రామస్థులు తదితరులు తరలివచ్చారు.