Friday, 6 November 2026

ఆదివాసీ సంఘాల నాయకుల అక్రమ అరెస్టులు అ ప్రజాస్వామ్యం * టీఎస్ ఎటిఎఫ్ ఖండన

ఆదివాసీ సంఘాల నాయకుల అక్రమ అరెస్టులు అ ప్రజాస్వామ్యం
* టీఎస్ ఎటిఎఫ్ ఖండన

టేకులపల్లి, డిసెంబర్ 28( జనం సాక్షి ): భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం పర్యటనను ఉద్దేశించి జిల్లా వ్యాప్తంగా వివిధ సంఘాల ఆదివాసీ నాయకులను ముందస్తు అక్రమ అరెస్టులు చేయడం అప్రజాస్వామిక చర్యగా తెలంగాణ ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ భావిస్తూ తీవ్రంగా ఖండించింది. వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు ఆదివాసీల పోడు భూములు, జీఓ నెం.3, 1/70, పేసా చటాలు, ఆదివాసీ నిరుద్యోగ తదితర సమస్యలను భారత రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లి తమ సమ్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గనిర్దేశం చేయాలని రాష్ట్రపతికి ప్రాతినిధ్యం చేయాలని ఆదివాసీ సంఘాలు సమాయత్తం అవుతుంటే ఇలా అక్రమ అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనని ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ భావిస్తుంది అని టేకులపల్లి పోలీసులు ముందస్తుగా అదుపులో తీసుకున్న టీఎస్ ఏటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ళ శ్రీనివాసరావు అన్నారు. ఆదివాసీ సంఘాల ప్రతినిధులు రాష్ట్రపతికి మెమొరాండం ఇస్తే తెలంగాణలో ఆదివాసీల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలు, డొల్లతనం రాష్ట్రపతి ముందు బయటపడుతుందని ఈ విధమైన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పునుకున్నట్లు అర్థమవుతుంది అని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆదివాసీ వ్యతిరేఖ విధానాలను ఆదివాసీ సమాజం గమనిస్తున్నదని, తగిన రీతిలో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఏజన్సీ, నాన్ ఏజన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు సిద్దంగా ఉండాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఆదివాసీ మహిళను భారత రాష్ట్రపతిగా నియమించి అదే సామాజిక వర్గాల ఆదివాసీల సమస్యలను చెప్పుకోవడానికి సిద్ధమైన ఆదివాసీ నాయకులను రాష్ట్రపతిని కలవనీయకపోవడం శోచనీయం అని అన్నారు.
ఆదివాసీలకు ఉన్నత పదవులు ఇవ్వడమనేది ఓటు బ్