హైదరాబాద్: ఎక్స్‌గ్రేషియాతో కూడా సీమాంధ్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపిస్తుందని టీఆర్‌ఎస్ ఎల్‌పీ ఉప నేత హరీష్‌రావు ఆరోపించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు చనిపోతే రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం, సింగరేణి కార్మికులు చనిపోతే మాత్రం రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం దారుణమని విమర్శించారు. కార్మికులది ఎవరిదైనా ప్రాణం ఒక్కటే కాదా అని ఆయన ప్రశ్నించారు. నిన్న ప్రమాదంలో మరణించిన సింగరేణి కార్మికుడికి రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.




