వచ్చేనెల 4కు కేసు వాయిదా వేసిన హైకోర్టు
హైదరాబాద్,డిసెంబర్3 (జనంసాక్షి) : మేయర్, డిప్యూటీ మేయర్ ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటు హక్కుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 90(1) కొట్టివేయాలని పిటిషన్‌లో అనిల్ కుమార్ కోరారు. దీనిపై విచారించిన హైకోర్టు.. వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం, ఎస్‌ఈసీ, జీహెచ్‌ఎంసీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు జనవరి 4కు వాయిదా వేసింది. తెలంగాణలో ఎక్స్‌అఫీషియోల 50మంది వరకు ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరి ద్వారా అసలు ఎన్నికైన వారిపై ప్రభావం చూపనుందని పిటిషనర్ వాదించారు.
ఎక్స్ అఫీషియో ఓటింగ్‌పై విచారణ




