Monday, 2 November 2026

ఎగిరిన కార్మిక జెండాఎగిరిన కార్మిక జెండా

 

 

 

 

 

 

 

కొత్తగూడ మే 1 జనంసాక్షి:అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే కార్మికుల పోరాటం,కార్మికుల ఐక్యతను సూచిస్తుంది.కొత్తగూడ మండల కేంద్రంలో మెకానిక్ యూనియన్ అధ్యక్షులు నామోజు కృష్ణ కార్మిక జెండాను ఆవిష్కరించారు.అనంతరం చికాగో ఉద్యమంలో మరణించిన వారికి నివాళులు అర్పించారు.కృష్ణ మాట్లాడుతూ చికాగోలో వున్న కొంతమంది రక్త తర్పణం చేసి కేవలం తమ దేశంలో వుండే కార్మిక వర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు.ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే,మా శక్తికి కూడా పరిమితులుంటాయి.ఈ చాకిరీ మేం చేయలేమని పని ముట్లు కింద పడేసి 8గంటల పని దినం కోసం పోరాడటం,చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం అని అన్నారు.ఈ కార్యక్రమంలో మెకానిక్ యూనియన్ నాయకులు,కార్మికులు పాల్గొనడం జరిగింది.