ఎడ్ల బంజర్ లో భక్తి శ్రద్దలతో విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం భక్తుల తో కోలాహలంగా గ్రామం*ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే సండ్రపెనుబల్లి, మార్చి 24 ఎడ్ల బంజర గ్రామంలో శుక్రవారం వేద పండితులు వేద మంత్రాల తో భక్తులతో రామనామ జపం తో కన్నులవిందుగా విగ్రహా ల ప్రతిష్టా మహోత్సవం జరిగింది, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎడ్ల బంజర్ గ్రామంలోని నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయంలో విగ్రహాల ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ సంధర్భంగా సత్తుపల్లి ఎం ఎల్ ఏ. సండ్ర వెంకట వీరయ్య ప్రతిష్టా మహోత్సవం లొ పాల్గొ న్నారు, ఆలయ ధ్వజస్తంభంతోపాటుగా సీత,రామ,లక్ష్మణ సమేత హనుమంతుని విగ్రహాలతో పాటుగా బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి, పోతురాజుల విగ్రహాల ప్రతిష్టను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా ప్రతిష్టించారు. ఈ సందర్భంగా గడచిన మూడు రోజుల పాటు వేద పండితులు యజ్ఞ యాగాదుల నడుమ శాస్త్రోక్తంగా ప్రతిష్టా మహోత్సవాలను జరిపించారు. గ్రామానికి చెందిన ఆడబిడ్డలు ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించి ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్నారు. మహా అన్నదాన కార్యక్రమంలో పరిసర ప్రాంత ప్రజలు భక్తులు సుమారు 12 వేల మంది హాజరయ్యారు. దీంతో గ్రామం కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముందస్తుగా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆలయ నిర్మాణానికి రూ. 50 వేలు తన మిత్రుడు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తరుపున రూ.1 లక్ష విరాళంగా అందజేశారు. మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆలయ నిర్మాణానికి రూ.50, 116 విరాళంగా అందజే సినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు సోమరాజు సీతారామారావు, జంపా వేణుబాబు, టివి రామారావు, గోపిశెట్టి సుబ్బారావు ఎడ్ల సుబ్బారావు లు తెలిపారు.
ఎడ్ల బంజర్ లో భక్తి శ్రద్దలతో విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం




