. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి.
గుడిహత్నూర్: మార్చ్, 24( జనం సాక్షి)విద్యార్థి దశ నుంచి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జూనియర్ సివిల్ జడ్జి బి.హుస్సేన్ అన్నారు. శుక్రవారం మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ బోథ్ ఆధ్వర్యంలో చట్టాల గురించి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సివిల్ జడ్జి మాట్లాడుతూ నిత్య జీవితంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు విద్యార్థులు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. పోక్సో చట్టం 2012లో ఏర్పాటయిందని బాలలను లైంగికంగా వేధింపుల నుండి రక్షణ కలిగేటట్లు వ్యవహరిస్తుందని బాలలకు పూర్తిస్థాయిలో న్యాయం అశ్లీల నేరాల నుండి కాపాడడం 18 సంవత్సరాల వయసులోపు వారందరూ బాలలే అని పోక్సో చట్టం తెలియజేస్తుందన్నారు. నేటి ప్రపంచంలో బాలురతో పాటు బాలికలకు కూడా సమాన హక్కులు ఉన్నాయని విద్య హక్కు, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, మోటార్ వెహికల్ ,కోర్టు పరిధిలో జరిగే విషయాలకు గురించి విద్యార్థులకు తెలిపారు.అనంతరం వసతి గృహ సముదాయాన్ని తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రెటరీ పంద్రం శంకర్,ఎస్సై ప్రవీణ్, న్యాయవాది ఆడెపుహరీష్, కుమ్మరి విజయ్ కు
విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి




