హైదరాబాద్: ఆల్వాల్‌లోని జవహర్‌నగర్‌లో నిన్న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో తెదేపా నేతలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. దాదాపు 15 అడుగులు ఉన్న విగ్రహాన్ని పగలగొట్టడంపై కార్యకర్తలు మండిపడ్డారు. దోషులను గుర్తించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు విషయం తెలుసుకున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఈ ఘటనను ఖండించారు.




