Wednesday, 4 November 2026

ఎన్నో యేడ్ల కల నెరవేర్చిన ఎమ్మెల్యే పెద్ది 1కోటి 80లక్షల నిధులు మంజూరి బిటి రోడ్డు పనులు ప్రారంభం పనులను ప్రారభించిన బిఆర్ ఎస్ మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి

 

జనం సాక్షి, చెన్నరావు పేటమండలంలోని ఖాదర్ పేట, గొల్లపల్లి గ్రామం మీదుగా కోరాంకుంటా తండా వరకు బిటి రోడ్డు మూడు గ్రామాల ప్రజల చిరకాల కోరిక ఎన్నో యెడ్ల కలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ని కోరగా వెంటనే స్పందించి 1 కోటి 80 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది,నిర్మాణ పనులను బిఆర్ ఎస్ మండల కన్వీనర్ కంది కృష్ణ రెడ్డి, మాజీ ఎంపీపీ జక్క అశోక్ యాదవ్ పనులు ప్రారంబించడం తో మూడు గ్రామాల ప్రజలు ఆనందంతో కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు మహ్మద్ రఫీ, సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షులు కుండే మల్లయ్య, ఖాదర్ పేట సర్పంచ్ అనుముల కుమారస్వామి, బానోతు రమేష్,దారవత్ కిషన్, ఎంపీటీసీ లు దారవత్ శ్రీను, కడారి సునీత,సాయిలు, ఉపాసర్పంచ్ కొంకటి రాజు ,గ్రామ పార్టీ అధ్యక్షులు చింతం మహేందర్, విజేందర్, బిఆర్ ఎస్ నాయకులు పెంతల బుచ్చిర పెండ్లి రాజశేఖర్, నిలిగొండ రవీందర్,అరిగేల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.