Wednesday, 4 November 2026

రక్త దాన శిభిరం..

తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా జైపూర్తాసిల్దార్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం లో రక్తదాన శిబిరాన్నిమంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్ ప్రారంభించి వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని తాసిల్దారుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామని అన్నారు.ఇట్టి రక్తాన్ని మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీ వారు సేకరించి తలసేమియా వ్యాధిగ్రస్తులకు, కిడ్నీ డయాలసిస్ బాధితులకు, గర్భిణీ స్త్రీలకు, ఉపయోగిస్తారని అన్నారు. ఈనెల 27న మంచిర్యాల లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు 500 మంది తో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం రక్తదాతలకు ప్రశంస పత్రాలను అందజేసి వారిని అభినందించారు.ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ చేతుల మీదుగా జైపూర్ మండల తాసిల్దార్ మోహన్ రెడ్డి గారిని ఘనంగా శాలువాతో సన్మానించడం జరిగినది.రక్త దాన శిబిరంలో 42 మంది రక్తదానం చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలోమంచిర్యాల ఆర్డీవో వేణు,జైపూర్ తాసిల్దార్ మోహన్ రెడ్డి, జైపూర్ ఎంపీడీవో సత్యనారాయణ,డిప్యూటీ తాసిల్దార్ ఎల్.కృష్ణ , ఎం.పి.ఓ అనిల్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి డాక్టర్ అనిల్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ చందూరు మహేందర్,మంచిర్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు వి.మధుసూదన్ రెడ్డి,కాసర్ల శ్రీనివాస్, వైద్యులు డాక్టర్ కమలాకర్,
తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్, సభ్యులు రామటెంకి సాయి
ఆర్.ఐ కమల, తాసిల్దార్ సిబ్బంది మరియు రేషన్ డీలర్లు గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు