పశ్చిమబెంగాల్‌ ఉపఎన్నికల్లో తృణముల్‌ ఘనవిజయం

పశ్చిమబెంగాల్‌, ఫిబ్రవరి 17 జ‌నంసాక్షి : రాష్ట్రంలో రెండుస్థానాలకు జరగిన ఉప ఎన్నికల్లో తృణముల్‌ కాంగ్రెస్‌ విజయదుందుభి మోగించింది. కృష్ణగంజ్‌ అసెంబ్లీ, బనగాన్‌ లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులపై తృణముల్‌ కాంగ్రెస్‌ నేతలు విజయం సాధించారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తల ఆనందానికి అంతులేకుండాపోయింది. పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు.