Wednesday, 4 November 2026

ఎన్‌బీఆర్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

 

 

 

 

 

 

మిర్యాలగూడ, జనం సాక్షి.
మిర్యాలగూడ పట్టణంలో ఎన్ఎస్పీ క్యాంపులోని గ్రంథాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎన్‌బీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డీఎస్పీ వెంకటగిరి, ఎన్‌బీఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ నల్లమోతు సిద్ధార్థ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి మహిళా పోలీసు అధికారులను, విద్యార్థులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఔత్సాహిక మహిళా అభ్యర్థులకు గ్రూప్స్ స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, రూరల్ ఇన్స్ పెక్టర్ ముత్తినేని సత్యనారాయణ, వన్ టౌన్ ఇన్స్ పెక్టర్ రాఘవేందర్ రావు, ఎన్‌బీఆర్ ఫౌండేషన్ సభ్యులు ఆయిల్ శ్రీను, వజ్రం, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు షోయబ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధికార ప్రతినిధి పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ యువజన ఉపాధ్యక్షులు యరమల్ల దినేష్, పగిడిమర్రి నాగేంద్ర చారి, బీజేపీ నాయకులు చిలుకూరు శ్యామ్, సుద్దుల సైదులు, సిరసనగండ్ల శ్రీకాంత చారి, గాదగొని మహేష్, బాచి, జీవన్, కుమ్మరి కుంట్ల సుధాకర్, నల్లగంతుల నాగభూషణం, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.