Wednesday, 4 November 2026

మహిళలు అన్ని రంగాల్లో రంగాల్లో ప్రతిభను చాటాలి – సుందిళ్ల సర్పంచ్ దాసరి లక్ష్మి

 

 

 

 

 

జనం సాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిల్ల గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని బుధవారం గ్రామ సర్పంచ్ దాసరి లక్ష్మీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ అభివృద్ధికి పనిచేస్తున్న మహిళా ప్రజా ప్రతినిధులను నామినేటెడ్ సభ్యులను, ఉద్యోగులను సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ముందుగా మహిళా దినోత్సవ సందర్భంగా సర్పంచ్ దాసరి లక్ష్మి కేక్ కట్ చేసి మహిళలకు తినిపించి, అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు మరెన్నో రంగాల్లో వారి ప్రతిభను చాటాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు సుంకరి లక్ష్మి జనగామ పద్మ, జనగామ వెంకటేష్, ఆర్ల ప్రణీత, బోగిరి దివాకర్, బోగిరి ధనలక్ష్మి, కోఆప్షన్ సభ్యురాలు మర్క రమాదేవి, శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయ కమిటీ సభ్యులు మందల నందక్క, జనగామ స్వరూప రాణి, గ్రామ ఏ.న్.మ్ స్వరూప ,అంగన్వాడీ టీచర్స్ అలుగువేలి విజయ, గర్రేపెల్లి పద్మ, గడ్డం వసంత, ఏదినూరి చంద్రకళ, జనగామ అను, వి.ఓ. సంఘం లీడర్స్ వడేపెల్లి రాజేశ్వరి, బోల్లంపెల్లి స్వరూప, గడ్డం పద్మ, ఆశ వర్కర్స్ కానుకుల లక్ష్మి కానుకుల రాజేశ్వరి, గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బోగిరి భాస్కర్, నాయకులు ఆర్ల మనోజ్ పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు