హైదరాబాద్,ఫిబ్రవరి 28(జనంసాక్షి): కేంద్ర బడ్జెట్ ఆంధప్రదేశ్‌కు ఆశాజనకంగానే ఉందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ విభజన ద్వారా ఏపీకి జరిగిన నష్టాన్ని పూరించేందుకు కేంద్రం ప్రయత్నించిందని చెప్పారు. ఏపికి ప్రత్యేక ఆర్థిక సాయం చేస్తామన్నందుకు కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పలు విద్యాసంస్థలకు నిధులు కేటాయించడం సంతోషకరమన్నారు. సర్వీసు ట్యాక్స్ పెంపు వల్ల ప్రజలపై భారం పడుతుందని సోమిరెడ్డి తెలిపారు. సంపదపన్ను రద్దు చేయడం శుభపరిణామని, నల్లధనంపై బిల్లును తెస్తామనడం ఆహ్వానించ దగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక ప్రతిపత్తిని ఆశించామన్న సోమిరెడ్డి ప్రత్యేక ¬దా సాధించే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు




